రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష విధిస్తా:ట్రంప్ 13 d ago
జో బైడెన్ ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మందిలో 37 మంది ఖైదీల శిక్షలను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి ప్రతిస్పందిస్తూ, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు."జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేయాలని న్యాయశాఖను ఆదేశిస్తానని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.